సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Raksha Bandhan

బాలికల అభివృద్ధి, భద్రతకు ప్రభుత్వాలు సహకరించాలి. ఎస్‌ఎఫ్‌ఐ

Raksha Bandhan : దేవరకొండ డివిజన్ ఆగష్టు 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ: ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ, “ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం” అనే నినాదంతో బాలికల విద్య, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బాలికల అభివృద్ధి, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహకరించాలని, విద్యార్థినులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

అదేవిధంగా బాలికలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంటారని అన్నారు. వివక్షత లేని సమాజం కోసం సమానత్వం నెలకొల్పాలని అన్నారు. విద్యార్థులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కమిటీ సభ్యులు ఏన్నుపోతుల పరమేష్,ఎడ్ల చలపతి, అనూష, సరస్వతి,మంజుల,స్వాతి,అనురాధ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page