
నాణ్యతలేని పనులపై గ్రామస్థుల ఆగ్రహం
Road Damaged : అనంతగిరి, జూన్ 3, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం గుమ్మకొట పంచాయతీ పరిధిలోని శంకుపర్తి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. ఇటీవలే నిర్మించిన ఈ రహదారి పలుచోట్ల కొట్టుకుపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, సరైన డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
ఈ రహదారి ద్వారా శంకుపర్తితో పాటు పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, ప్రస్తుతం గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు, అత్యవసర సేవలు అవసరమైన వారికి ఇబ్బందులు పెరిగాయని గ్రామస్థులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe