ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Say No to Drugs

Say No to Drugs : అరకులోయ ఆగస్టు 29, (త్రినేత్రం న్యూస్): మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం అరకువ్యాలీ మండలం నందివలస గ్రామంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గోపీనాథ్‌ జట్టి, జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌, హాజరై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక, ఆర్థిక జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించగలమని అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అనంతరం గ్రామస్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం ద్వారా గ్రామస్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యం తీసుకురావడంతో పాటు యువతను ఆరోగ్యకరమైన మార్గంలో నడిపించేందుకు పోలీసులు పలు సూచనలు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page