Chittam Murali : హెక్టగూడలో “సుపరిపాలన ” సందడి

TRINETHRAM NEWS

చిట్టం మురళి నేతృత్వంలో ఘనంగా వేడుకలు.

అల్లూరిజిల్లా(అనంతగిరి) అరకు నియోజవర్గం ఇంచార్జ్ త్రినేత్రం న్యూస్ జూన్ 5: రాష్ట్రంలో శుభ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా, అనంతగిరి మండలంలోని హెక్టగూడ గ్రామంలో “సుపరిపాలనకు ఏడాది” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఆధ్వర్యంలో జరుగగా, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “ఈ రోజు రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన గర్వదినం. గత ప్రభుత్వం అమలుచేసిన చెడు పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. ప్రజాస్వామ్యం, పారదర్శకతకు విజయోత్సవం” అని పేర్కొన్నారు.
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన వారు, గిరిజనుల హక్కులను విస్మరించడం, జీవో నంబర్ 3 పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకపోవడం గిరిజన యువతపై వెన్నుపోటుగా అభివర్ణించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో గిరిజన భూములు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా తప్పుబట్టారు.
అలాగే బోయ, వాల్మీకి వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రయత్నాల వెనుక గిరిజన వైసీపీ నాయకుల ప్రమేయం ఉండటం, గిరిజనులకు ఎదురుదెబ్బగా పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లు, మద్యం కుంభకోణాల కేసుల్లో నిందితులకు జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచినదే వైసీపీ అసలైన స్వభావానికి నిదర్శనమని విమర్శించారు.ఒకవైపు వైసీపీ “వెన్నుపోటు దినం”ను జరుపుకుంటుండగా, మరోవైపు కూటమి పార్టీలు “సుపరిపాలనకు ఏడాది” వేడుకలను నిర్వహించడం విశేషమని వారు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు సుబ్బారావు, జనసేన నాయకులు కొర్ర రవి, పాంగి లక్ష్మణ్, తెదేపా నాయకులు బాబీ, శంకర్రావు, భీమన్న, ధర్మాన, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

"Good Governance" buzz in

You cannot copy content of this page

Scroll to Top