
Karre Bikshapathi : త్రినేత్రం న్యూస్ జులై 6 ధర్మసాగర్ : గురువారం ధర్మసాగర్ లో సిపిఐ పాదయాత్ర కొనసాగుతూ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన సభ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి వేలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని క్రమబద్ధంగా దెబ్బతీసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని అన్నారు.
ఆగస్టు 6 నుండి ప్రారంభమైన ఈ దేశవ్యాప్త పాదయాత్రలు వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల గుండా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కానుందని తెలిపారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడంలో విఫలమయ్యారని, రైతు సంక్షేమాన్ని దెబ్బతీశారని అన్నారు.
మోదీ పాలనలో పెరుగుతున్న నియంతృత్వ ధోరణులలో భాగంగా రాజకీయ వ్యతిరేకులను అణచివేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను క్రమంగా నిర్వీర్యం చేయడం జరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్న సిపిఐ పోరు యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్ ఎ స్టాలిన్, ఉట్కూరి రాములు, మునిగాల బిక్షపతి, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, వేల్పుల సారంగపాణి, మాలోతు శంకర్, శనిగరపు రాజ్ కుమార్, రాసమల్ల దీనా, గుంటి రాజేందర్, ధర్మసాగర్ మండల కార్యదర్శి కొట్టె వెంకటేశ్, మండల నాయకులు సింగారపు కొమురయ్య, బొట్టు బిక్షపతి, కొట్టే లింగయ్య, వల్లపు సారయ్య, బండి రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe