
Amrutha Bharathi Foundation : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం.పెనుమూరు(జూన్. 27). పెనుమూరు మండలం సాతంబాకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమృత భారతి ఫౌండేషన్ చిత్తూరు వారిచే మండల ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సుమారు 100మంది పిల్లలకు రైటింగ్ ప్యాడ్స్, కంపాస్ బాక్స్, పెన్స్ సెట్ మరియు వివేకానందుని జీవిత కథ పుస్తకముతో కలిపి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ సమన్వయపరిచారు. కార్యక్రమంలో అమృత భారతి ఫౌండర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వివేకానందుని స్ఫూర్తితో నిర్వహిస్తున్నామన్నారు. సహ వ్యవస్థాపకుడు మరియు అవదాని ఆముదాల మురళి మాట్లాడుతూ నైపుణ్యము మరియు విలువలు పెంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 భాస్కర్ నాయుడు మాట్లాడుతూ మండలంలోని దాతల సహకారంతో విద్యార్థుల యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మండల విద్యాశాఖ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ కుమారస్వామి రెడ్డి, శంకరం, జనార్ధన్, చంద్రమోహన్, సాయి ఈశ్వరి, హేమలత సమస్త ప్రతినిధులు తరుణ్, లోకేష్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe