జూలై 23, 2026
TRINETHRAM NEWS
Launch Ceremony

Launch Ceremony : త్రినేత్రం న్యూస : గౌతమీ నది తీరాన అనే కథా సంపుటి జేగురుపాడు కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది .వివరాల్లోకి వెళ్తే జేగురుపాడు వాస్తవ్యుడు రచయిత రత్నాకర్ పెనుమాక అన్నీ బహుమతి పొందిన కథలతో ఈ సంపుటి తీసుకొచ్చారు . పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు & సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ ఆవిష్కరించారు.ఈ సంపుటి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు కి అంకితం ఇచ్చాడు రచయిత.ఇదే వేదిక మీద దార్ల వెంకటేశ్వరరావు కి అంకితోత్సవ సన్మానం చేసారు .వక్తలందరూ జాతీయ స్థాయి పురస్కారాలు పొందిన జేగురపాడులో సభ జరగటం మహదానందం అన్నారు .

ఈ గ్రామాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మాజీ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర ని, సాహిత్య పరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన రచయిత రత్నాకర్ ని వక్తలందరూ ప్రశంసించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు & సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్ ,అంకిత గ్రహీత ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా జేగురుపాడు మాజీ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర తో పాటు రచయిత రత్నాకర్ పెనుమాక, సభాధ్యక్షులు మధునాపంతుల సూర్యనారాయణ మూర్తి ,డా.దిగుమర్తి సురేష్ కుమార్ ,డా.ఝాన్సీ ,డా.మంజుశ్రీ, నూజిళ్ల సూరిబాబు, సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page