– ఫతేనగర్ శివాలయాల్లో ప్రత్యేక పూజలు
బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్
కూకట్పల్లి జనవరి 10 (త్రినేత్రం న్యూస్) : సోమనాథ ఆలయం విధ్వంసం అనంతరం పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న మన ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఫతేనగర్ ప్రాంతంలోని వివిధ శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు ధార్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివునికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమనాథ ఆలయ చరిత్ర, దాని పునర్నిర్మాణ ప్రాముఖ్యతపై ఆలయ నిర్వాహకులు భక్తులకు వివరించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో సోమనాథ ఆలయం ప్రతీకగా నిలిచిందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాల్లో భజనలు, హోమాలు నిర్వహించడంతో పాటు దేశ శ్రేయస్సు, ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


