Kanchi Mahender : భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాం పునాది

TRINETHRAM NEWS

బీజేపీ సీనియర్ నేత కంచి మహేందర్.

కూకట్పల్లి నవంబర్ 27 (త్రినేత్రం న్యూస్) : డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి మహానుభావునికి నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి ఎన్నికల వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్ష చేపట్టారు. దీక్ష ప్రాంగణానికి పోలీసులు విచ్చేసి, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకొని, నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, డా. కిరణ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, నాయకులు జి. రమేష్, శివరంజని తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Raj is the foundation of Indian democracy

You cannot copy content of this page

Scroll to Top