త్రినేత్రం న్యూస్: జనవరి 10: నెల్లూరు జిల్లా :కావలి : కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు రేపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావలి పట్టణంలోని విడ్స్ కాలేజీ పక్కన ఉన్న , ఎస్ .ఏ .ఏ .పి, గ్రౌండ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి , కావలి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమ వివరాలను తెలియజేశారు.సంక్రాంతి సంబరాలను ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించాలని వారు కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయాలకు ప్రోత్సాహం లభిస్తుందని, ప్రజల్లో సాంస్కృతిక చైతన్యం పెరుగుతుందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


