Trinethram News : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో జరిగి భారీ నక్సల్ ఆపరేషన్స్లో మావోయిస్టులకు భారీగానే ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో భద్రతా దళాలు 31మంది నక్సలైట్లను హతమార్చినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.
బీజాపూర్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్కు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఆర్పీఎఫ్ డీజీ, చత్తీస్గఢ్ డీజీపీ పాల్గొన్నారు.
‘కర్రెగుట్ట కొండలు చుట్టూ ఏప్రిల్ 21న ఆపరేషన్ కగార్ పేరుతో దీనిని ప్రారంభించాం. దాదాపు 21 రోజలు పాటు జరిగిన భారీ ఆపరేషన్లో దాదాపు 20వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. చత్తీస్గఢ్ పోలీసులు, సీఆపీఎఫ్ సిబ్బంది ఉన్నారు.
ఈనెల 11న ఆపరేషన్ను విరమించుకున్నాం. ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 21 ఎన్కౌంటర్లు జరిగాయి. 16మంది మహిళ కేడర్స్తో సహా 31మంది మావోయిస్టులు మరణించారు. వారి నుంచి SLR, INSAS, ఇతర ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ సహా 35 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్గౌతమ్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


