Collector Koya : 2 బంగారు పతకాలు,3వెండి పతకాలు ,3 కాంస్య పతకాల సాధన

TRINETHRAM NEWS

అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో జిల్లా విద్యార్థినులు అద్బుత ప్రదర్శన కనబరిచారని వీరికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన పెద్దపల్లి జిల్లా విద్యార్థినులను జిల్లా కలెక్టర్ అభినందించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మే 17 18 తేదీలలో ఉత్తరాఖండ్ హరిద్వార్ ఓకేనావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కరాటే 2025 పోటీలలో పెద్దపల్లి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు
అంతర్జాతీయ కరాటే 2025 పోటీలలో పెద్దపల్లి మహాత్మ జ్యోతిభా పూలే పాఠశాల విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. అండర్ 14 కట్ ఆఫ్ కుమితి విభాగంలో 2 బంగారు పతకాలు, 3వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు సాధించారని అన్నారు
అండర్ 14 కటాస్ కుమితి విభాగంలో టి. శరణ్య బంగారు వెండి, పతకం  జి.కృష్ణవేణి బంగారు, కాస్య పథకం జీ.వైష్ణవి వెండి కాస్య పథకం టి రక్షిత వెండి కా కాస్య పథకం యు కీర్తన వెండి కాశ్యం పథకం సాధించడం జరిగిందని తెలిపారు
అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కర్ర వెంకటేష్, ప్రిన్సిపాల్ మనిదీప్తి ఇన్స్పెక్టర్ అలేఖ్య విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

2 gold medals, 3 silver

You cannot copy content of this page

Scroll to Top