జిల్లా కలెక్టర్ అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, మే -20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో డీ.ఈ.ఈ.టి పని తీరు పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రివ్యూ నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందించే పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థలకు నిరుద్యోగులకు వారధిగా పనిచేసేందుకు ప్రభుత్వం డీ.ఈ.ఈ.టి (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ) ను ఏర్పాటు చేసిందని అన్నారు మన పెద్దపల్లి జిల్లాలో డీ.ఈ.ఈ.టి ప్లాట్ ఫారం పై 1810 మంది యువత ఉపాధి అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పొందేందుకు డీ.ఈ.ఈ.టి చాలా ఉపయోగపడుతుందని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఇందులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు జిల్లాలో డీ.ఈ.ఈ.టీ పట్ల విస్తృత ప్రచారం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. డీ.ఈ.ఈ.టి ప్లాట్ ఫారం ద్వారా యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని, వారి నైపుణ్యాల ఆధారంగా అర్హత గల ఉద్యోగాన్ని , నైపుణ్యాలను పెంచుకునేందుకు శిక్షణ సంస్థల సమాచారాన్ని , విద్యార్థులకు ఇంటర్న్ షిప్ అప్రెంటిషిప్ లకు సంబంధించిన సమాచారం అందుతుందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కీర్తి కాంత్,డి. ఆర్. డి. ఓ. కాళిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


