నూతనంగా క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక ను నియమించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, మార్చి – 10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పేషెంట్స్ కు ఉచితంగా 2డీ ఎకో సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక మర్యాదపూర్వకంగా కలిశారు
పెద్దపల్లిలోని మాతా శశి ఆసుపత్రిలో డాక్టర్ ప్రియాంక ఎంబిబిఎస్, డిప్ కార్డ్ క్లినికల్ కార్డియాలజిస్ట్ ను రిక్రూట్ చేసుకున్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల పేషంట్ల కు ఉచితంగా 2 డీ ఎకో సేవలు అందించ బడుతాయని తెలిపారు
గర్భిణీ స్త్రీలకు, ఆర్థో పేషెంట్లకు, జనరల్ సర్జరీ పేషెంట్లకు, ఏ ఇతర పేషంట్లకైనా ఇక నుంచి 2 డీ ఎకో సేవలు నిర్వహించబడతాయని, 2 డీ ఎక్కువ వల్ల ఆపరేషన్ చేసినప్పుడు పేషంట్లకు సేఫ్టీ ప్రమాణాలు పెరుగుతాయని, అవసరమైన రోగులు ఈ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


