త్రినేత్ర న్యూస్ అక్టోబర్ 21, అనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన పోరాటం ఫలితంగా కొన్ని చోట్ల అక్రమ షాపులు మూసివేయబడ్డాయని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలిపారు.
అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో వీధి వీధికి బెల్ట్ షాపులు విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కల్తీ మద్యం ఇక్కడ అమ్మకాలు జరగడంతో ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది,” అని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, రామకృష్ణారెడ్డి ఈ అక్రమ వ్యాపారాలకు అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మద్యం విక్రయ కేంద్రాల వివరాలు, ఎక్సైజ్ శాఖకు అందించినా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో మీడియా ప్రశ్నలకు కూడా ఎమ్మెల్యే స్పందించలేదు, అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలిపారు.
వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగి ఎక్సైజ్ సీఐని గట్టిగా ప్రశ్నించడంతో అనేక బెల్ట్ షాపులు మూసివేయబడ్డాయి.
కల్తీ మద్యం విక్రయం వల్ల అనేక కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా లివర్ వ్యాధులతో, బాధపడుతున్నారని, ఆయన తెలిపారు. అక్రమ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రజల ఆరోగ్యం రక్షణ కోసం సర్వేలు, వైద్య శిబిరాలు నిర్వహించాలి, అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, డిమాండ్ చేశారు.
ఎక్కడైనా ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు మద్యం, అమ్మకాలు జరిగితే, అక్కడ కూడా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది. అన్ని బెల్ట్ షాపులు పూర్తిగా మూసివేయడమే మా లక్ష్యం, అని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


