నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ విజయవంతం.ప్రభుత్వ వైద్యశాల పరిరక్షణకు ప్రజల నుంచి విశేష మద్దతు ——- నియోజకవర్గ పరిశీలికలు & వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆళ్ల చల్లారావు.
జగ్గయ్యపేట నియోజకవర్గం వ్యాప్తంగా 61600 (ఆరవై ఒక వెయ్యి ఆరు వందలు) సంతకాల సేకరణ
ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట నియోజకవర్గం
ది:-10-12-2025/ బుధవారం
_రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాల పరిరక్షణకు వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమం విజయవంతం అయిందని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరావు అన్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ నాగేశ్వరావు మరియు నియోజకవర్గ పరిశీలికలు ఆళ్ల చల్లారావు ఈ సంతకాల స్వీకరణ పత్రాలను ఒక ప్రత్యేకమైన వాహనంతో జెండా ఊపి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కార్యాలయం నుంచి విజయవాడ జిల్లా కార్యాలయానికి పార్టీ నాయకులు కలిసి పంపించారు.
జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ప్రత్యేకమైన వాహనంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నడుమ ర్యాలీగా విజయవాడ రోడ్డు మీదగా చిలకల్లు వరకు వెళ్లి ఆ ప్రత్యేకమైన వాహనాన్ని విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయానికి పంపడం జరిగినది
ఈ సందర్భంగా మాట్లాడుతూ…..
నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సంతకాల కార్యక్రమంలో భాగ్యస్వాములయ్యారు అని, భవిష్యత్తు తరాల కోసం ఈ సంతకం ఉపయోగపడాలని ఆకాంక్షించారు, ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ ప్రకటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాలను ప్రజల నుంచి స్వీకరించారుఅని, వైఎస్ఆర్సిపి నిర్ణయించింది.
రాష్ట్రంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే 2023 -24 కాలంలోనే అందులో ఐదు కళాశాలలో ప్రారంభించారు, మిగతా కళాశాలల్లో వివిధ దశల్లో ఉన్నాయి, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రయోజనాలను కాదని కేవలం రాజకీయ కక్షతో వీటికి మంగళం పాడి తన బాధ్యత నుండి తప్పుకొని పీసీసీ విధానాల్లోకి వీటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు సిద్ధమయిందని అదే జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించాలన్న కళ నెరవేరకుండా పోతుంది. అని పేర్కొన్నారు.
ప్రజల పక్షాన నిలిచిన వైసిపి ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడానికి వైఎస్ఆర్సిపి తీవ్రంగా ఖండించింది. పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమానికి పార్టీ నేతలు సంతకాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు, ఇందులో భాగంగా ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల స్వీకరణ చేపట్టి రాష్ట్ర గవర్నర్ కి అందజేయాలని నిర్ణయించుకున్నారు అక్టోబర్ లో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని ఈ నెల మూడో తేదీ వరకు నియోజకవర్గంలో సంతకాల స్వీకరణ పూర్తయిందని ఈనెల 10 అంటే ఈరోజు సంతకాల కరపత్రాలు ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నామని అనంతరం 15వ తేదీన జిల్లా కార్యాలయం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని అక్కడి నుంచి ఈ నెల 17న జగన్మోహన్ రెడ్డి తో కలిసి గవర్నర్ కి వెళ్లి ప్రజా అభిప్రాయాన్ని అందజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు మండవ శ్రీనివాస్ గౌడ్, గింజుపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షుడు మార్కాపూర్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల ప్రధాన కార్యదర్శులు & కార్యదర్శులు సంపత్ విజిత, కన్నమాల కన్నమాల శామ్యూల్, బత్తుల రామారావు, పెంటి శ్రీనివాసరావు, దర్శనాల వెంకటరమణ, కాటేపల్లి రవికుమార్, శివరాత్రి పృథ్వీరాజ్ పట్టణ పార్టీ అధ్యక్షులు పటాన్ ఫిరోజ్ ఖాన్ మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహ రావు, పొన్నం కోటేశ్వరరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మహిళలు, వైఎస్ఆర్సిపి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


