Trinethram News : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా, వినుకొండ నియోజకవర్గంలో సేకరించిన 63 వేలపైచిలుకు సంతకాల పత్రాలను ఈరోజు నిర్వహించిన భారీ ర్యాలీ ద్వారా ఘనంగా పంపిణీ చేశారు.
వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నరసరావుపేట రోడ్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీ అనంతరం సేకరించిన సంతకాల పత్రాలతో కూడిన వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి, పల్నాడు జిల్లా కేంద్రానికి అధికారికంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి పెదకూరపాడు–వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయం అయిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తమ ధృడమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


