YSRCP Youth Protest : విశాఖపట్నంలో వైయస్ఆర్ సీపీ యువత పోరుకు భారీ స్పందన

TRINETHRAM NEWS

Trinethram News : పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గరికి యువకులు ర్యాలీ. దాంతో ఓర్వలేక కూటమి నేతల ఆదేశాలతో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

యువతకి ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ఏంటి చంద్రబాబు నాయుడు ఈ కుట్రలు?

ఈ రోజు విశాఖపట్నం, జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద గల కృష్ణ మందిరం నుండి పాదయాత్ర యువత మరియు విద్యార్థులు నాయకులతో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మద్దతుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిపెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు, మెడికల్ కాలేజ్ లు ప్రైవేటీకరణ పై, నిరుద్యోగ యువతకు రూ. 3,000 భృతి చెల్లించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు, పార్టీ పార్లమెంట్ పరిశీలకులు,మాజీ శాసన సభ్యులు శ్రీ కదిరి బాబు రావు గారు, శాసనమండలి సభ్యురాలు మరియు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు, మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు, మాజీఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, డిప్యూటీమేయర్ , రాష్ట్ర మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేటర్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge response to YSRCP

You cannot copy content of this page

Scroll to Top