జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 14 at 21.20.17

TRINETHRAM NEWS

వినుకొండ లోని బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా గారితో పాటు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి శ్రీ అనీల్ కుమార్ యాదవ్ గారు, గుంటూరు – 2 శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరి గారు వినుకొండ నియోజకవర్గం లోని అన్ని మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులు అయిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమయంలో పార్టీ కి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే సమయం ఆసన్నమైంది అని, రానున్న ఎన్నికల్లో మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారం లో వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కష్ట పడి పని చేయాలని సూచించారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన నవరత్న కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ప్రతి ఇంటి మన అందించిన సంక్షేమాన్ని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వారికి వివరిస్తూ, మరలా మనం అధికారం లోకి వస్తే, అందించే సంక్షేమాన్ని కూడా వారికి తెలియజేయాలని సూచించారు.

వినుకొండ ఆర్యవైశ్యులపై, అలాగే వారు దివంగత నేత కొనిజేటి రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వారు చేసిన దాడులను ప్రజలు గమనిస్తున్నారని, రోసయ్య విగ్రహాన్ని ధ్వంసం చేసే క్రమం లో ఆర్యవైశ్యులకు కూడా తీవ్ర గాయాలు కావడం వారి రౌడీయిజానికి నిదర్శనం అని తెలిపారు. గతం లో కూడా ఆర్యవైశ్య లపై అనేక ఇబ్బందులు పెట్టిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు కూడా దాడులు చేసి వారిని బెదిరించాలని చూస్తున్నారు. టిడిపి నాయకులు చేసిన కవ్వింపు చర్యలకు ఘాటైన సమాదానం ఓటు రూపం లో సమాధానం చెబుతారని హెచ్చరించారు..

You cannot copy content of this page