జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 14 at 21.19.34

TRINETHRAM NEWS

వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామం నందు వైయస్సార్ విలెజ్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, అందుగుల కొత్తపాలెం గ్రామం కు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం గౌవర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. ఈ గ్రామం లో నీటి సమస్య ను సైతం తీర్చగలిగామని తెలిపారు. గుండ్లకమ్మనది పై బ్రిడ్జి నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరు కాగా ఎన్నికల సమయం వల్ల వాయిదా పడిందని, మరలా మన ప్రభుత్వం రాగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ఈ గ్రామం లో 3 పేస్ కరెంటులైన్ కు ఇక్కడి నాయకులు అడగటం తో, సంభందిత అధికారులతో మాట్లాడి ఆ పనిని పూర్తి చేశామని తెలిపారు..

గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, ఒక మాట ఇస్తే నెరవేర్చే విధంగా పని చేసే ప్రభుత్వమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అని తెలిపారు. గత ప్రభుత్వం వారు చెప్పుకోదగిన ఒక్క పని కూడా లేదని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ని వెన్నుపోటు పొడిచి మానసికంగా ఇబ్బంది పెట్టి వారి చావుకు కారణమైన చంద్రబాబును ప్రజలు మర్చిపోరని తెలిపారు.

You cannot copy content of this page