జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జనవరి 10 త్రినేత్రం న్యూస్. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డి.ఎస్.పి శ్రీనివాస్ అన్నారు. శనివారం డిండి మండల పరిధిలోని డాక్య తండా గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మద్యానికి,డ్రగ్స్ కు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చదువులో క్రీడల్లో రాణించాలని సూచించారు. తల్లిదండ్రులకు , చదువు చెప్పిన గురువులకు పుట్టిన నేల కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై బాలకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, డాక్యతండ సర్పంచ్ వడత్యా శీను, ఉప సర్పంచ్ లక్ష్మి రామ్, వివిధ గ్రామాల సర్పంచులు శంకర్, కిషన్,రమేష్, వార్డు మెంబర్లు శివ హనుమంతు,శ్రీను, ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth should excel in sports

You cannot copy content of this page