Collector : పెన్షన్ దారులకు ముఖ చిత్రం ద్వారా పెన్షన్ అందించడం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : సోమవారం సమీ కృతకార్యాలయాల సముదాయం లో సమావేశం హాలు నందు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 194 మంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లను ఎంపిక చేయడం జరిగిందని, విరందరికి మొబైల్ ఫోన్ లు అందించడం జరుగుతుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే ఆసరా పెన్షన్ లకు సంబందించి మొబైల్ ఫోన్ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
మొబైల్ ఫోన్ తో పెన్షన్ దారుల యొక్క ముఖ చిత్రాన్ని ఫోటో ద్వారా పెన్షన్ అందించేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, అడిషనల్ డి ఆర్ డి ఓ సెర్ఫ్ నర్సిములు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Providing pension to pensioners

You cannot copy content of this page

Scroll to Top