Trinethram News : ఈ నెల 11న జరిగే రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నేడు దేవరకొండ పట్టణంలోని 10,11,13వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపును ఆకాంక్షిస్తూ, ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించి, మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అభ్యర్థించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీ ప్రతినిధిగా — దేవరకొండ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం నా ధర్మంగా భావిస్తూ, ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా వడివడిగా ముందుకు సాగుతున్నానని, నియోజకవర్గ కీర్తి, ప్రతిష్ఠను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో అహర్నిశలు కృషి చేస్తున్నాననీ తెలిపారు.
ఈ ప్రచారంలో ప్రజా ప్రతినిధులు, పట్టణ ముఖ్య నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


