త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, మండపేట మండలం, వై.సీతానగరం ఎంపిటిసి అడ్డాల శ్రీదేవి, వైసీపీ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు వీరవెంకట సత్యనారాయణ (రామరాజు) లు ఆ గ్రామ టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు అయినంపూడి నాగరాజు ఆధ్వర్యంలో మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర అంచనాలకమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, సమక్షంలో వైసిపి ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరు ఇరువురుకి ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి ఉండమట్ల వాసు, పెనుమత్స వెంకటవర్మ రాజు, చామంతిపూడి వీర్రాజు, నంబూరి రామరాజు, పర్వతిని వీర్రాజు, గొడవర్తి సత్యనారాయణ, మేక జేజిబాబు, కోడి రామ్మోహన్ రావు, పలివెల దానియేలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


