అనపర్తి:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఏపీ సర్కిల్ రాష్ట్ర 14 వ ద్వై వార్షిక సమావేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులను సభ హర్షద్వనాల మధ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..గ్రామీణ తపాలా ఉద్యోగుల మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ గా అనపర్తి మండలం దుప్పలపూడి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వై.కామేశ్వరి ఎన్నికయ్యారు.
రెండు రోజులపాటు నంద్యాలలో జరిగిన గ్రామీణ తపాలా ఉద్యోగుల సదస్సులో ఆమె ఎన్నికయ్యారు. కామేశ్వరి గత దశాబ్ద కాలంగా పోస్టల్ యూనియన్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చురుకుగా పాల్గొంటున్నారు జిడిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా నిరంతరం కృషి చేస్తున్నారు మహిళా ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది రాష్ట్ర కన్వీనర్ గా కామేశ్వరి ఎంపిక పట్ల పలువురు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులంతా అభినందనలు తెలియజేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


