పాండవుల మెట్టను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తాము
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఉన్న ముఖ్యమైన బౌద్ధ వారసత్వ ప్రదేశమైన పాండవుల మెట్ట అభివృద్ధి, పరిరక్షణ అవసరాన్ని రూడా చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ & రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి,రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ,రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి దృష్టికి తీసుకువెళ్ళారు. గురువారం పాండవుల మెట్ట వద్ద ఉన్న బుద్ధుని వారసత్వ ప్రదేశాన్ని వారి తో కలిసి సందర్శించారు. ఈ ప్రదేశం లోతైన ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని పార్లమెంట్ సభ్యుల సహకారం ఈ ప్రాంతం బౌద్ధ పర్యాటక సర్క్యూట్లో ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
పాండవులకొండ అని కూడా పిలువబడే పాండవుల మెట్టలో రాతి గుహలు,నీటి తొట్టెలు, స్థూపాలు,చైత్యాలు మరియు విహారాలు ఉన్నాయి. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక చిహ్నం, ఇది విజయవాడలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) అమరావతి సర్కిల్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం, ఈ ప్రదేశం శిథిలావస్థలో ఉంది మరియు తక్షణ పరిరక్షణ అవసరం ఉంది .ఈ ప్రాంతం సందర్శకులకు అనువు గా ఉండటానికి తగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగాల్సి ఉంది.పాండవుల మెట్టను ఆధ్యాత్మిక మరియు పర్యావరణ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం,జనసేన, బిజెపి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


