త్రినేత్రం న్యూస్, ( నియోజకవర్గ ఇంచార్జ్) : అల్లూరిజిల్లా, పాడేరు గిరిజనుల ఆరాద్యదైవం శ్రీ మోదకొండమ్మ తల్లి వారి ప్రాంగణంలో ప్రపంచ ఫోటోగ్రపి దినోత్సవ వేడుక రంగ, రంగ వైభవంగా జరిగింది. ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు అయిన లూయిస్ జాక్సన్ మండే డాగ్యురే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, పాడేరు దుర్గమ్మ తల్లి సన్నిధి నుండి మోదకొండమ్మ తల్లి ప్రాంగణం వరకు, ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఏజెన్సీ పదకొండు మండలాల అనుభవజ్యులైన ఫోటోగ్రాఫర్లకు సన్మానించటం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ ముఖి శేషాద్రి, ఏపీటీఆర్ఏ విలేకర్ల సంఘం అధ్యక్షులు పి. సూర్యారావు, ఆదివాసి విలేకర్ల సేవా సంఘం అధ్యక్షులు టి.మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగునే అల్లూరి జిల్లా ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


