World Photography Day : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

World Photography Day Celebrations

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ

ఆగస్టు19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో గోదావరిఖని కళ్యాణ్ నగర్ లోని ఆపిల్ కిడ్స్ స్కూల్లో మంగళవారం ముందస్తు వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు మగువ అధ్యక్షురాలు గాలి సునీత హాజరై సీనియర్ ఫోటో గ్రాఫర్లు ఎదులాపురం సుదీర్ బాబు, దబ్బెట శంకర్ లను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
అతిధులు మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ రంగంలో గత మూడు దశాబ్దాలుగా ఉన్నత విలువలతో సేవలను అందిస్తూన్నారని, ఫోటోగ్రఫీ లో రాణిస్తున్నారని ఫోటోగ్రఫీ డే సందర్భంగా వారి సేవలను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీచర్స్ ఫర్జాన, ఆరుణ, లావణ్య తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top