త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలం ద్వారపూడి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ చేపట్టాల్సిన భద్యత అందరిపైనా ఉందని రాష్ర్ప అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంధర్బంగా మండపేట మండలం, ద్వారపూడి పి.హెచ్.సి నందు గురువారం ఆయన మొక్కలు నాటారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ప్రధానమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మండల అధ్యక్షులు కర్రి తాతరావు, మాజీ మండల అధ్యక్షులు యరగతపు బాబ్జి, అడబాల బుల్లబ్బు, పల్ల బాబు, పల్ల వాసు, తానంకి చంద్రశేఖర్, లక్ష్మణ్, ఎన్.ఎస్.ఆర్.ఎస్.నాయుడు, లక్ష్మి వీరభద్రరావు, మండా వీరభద్రరావు, వర్రె వీరబాబు, కొమ్మన సూరిబాబు, పిల్లా తాతాలు, ఎంపిడిఒ, పి.హెచ్.సి సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


