Bathula : మొక్కల్ని పరిరక్షించడం మన జీవన మనుగడకు అత్యంత అవసరం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజానగరం మండలంలోని,రాజానగరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్,శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి, పాల్గొని, సచివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా అందరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని పరిరక్షించడం అంత కన్నా ముఖ్యమని తెలిపారు. చెట్లు అనేవి మనందరికి ప్రాణవాయువును ఇచ్చేవని వాటిని నరకడం వలన వాతావరణానికి హాని ఏర్పడుతుందని చెప్పారు. చెట్ల ప్రాధాన్యత అందరికి తెలిపి, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం… అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎన్ డి ఏ కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Protecting plants is essential

You cannot copy content of this page

Scroll to Top