MLA Vegulla : గోదావరి మృతుడు రోహిత్ కుటుంబానికి రూ 2 లక్షల తక్షణ భృతి అందించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట ఇటివల మండపేట కు చెందిన కులపాక మల్లేశ్వర వీర వెంకట రోహిత్ ముమ్మిడివరం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి కొట్టుకుని పోయి మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 లక్షలు ఆర్థిక సహాయం చెక్కు ను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, గురువారం అనాథగా మిగిలిన రోహిత్ చెల్లెలు బిందు మాధవి కి అందజేశారు. రోహిత్ తండ్రి రవీంద్రనాథ్ ప్రసాద్, తల్లి గతంలో మృతి చెందారు. దీంతో రోహిత్ చెల్లెలు అనాథగా మారింది.

ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆమె నివాసం ఉంటున్న గొల్లపుంతలో గల టిడ్కో అపార్ట్మెంట్ కు స్వయంగా వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన తక్షణ భృతి రెండు లక్షలు చెక్కు ను ఆమె కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ బింధు మాధవి కి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వర ప్రకాష్, 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాథం, మండపేట మార్కెట్ కమిటి డైరెక్టర్ డైరెక్టర్ మేడింటి సూర్య ప్రకాశరావు, టిడిపి నాయకులు టేకి వెంకట రమణ, కురసాల సత్యనారాయణ, షేక్ కరీం, తాహశిల్దార్ పి.తేజేశ్వరరావు, రెవెన్యూ అధికారి ఎస్.అనుపమ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla, who provided

You cannot copy content of this page

Scroll to Top