Workers’ wages : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కార్మికులకు కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
వికారాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కర్ యార్డ్ నుండి RDO ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి,సభ citu యూనియన్ జిల్లా నాయకులు అమృత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు ధరలు పెరుగుతున్నవి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26వేలు అమలు చెయ్యాలి. 60ఏండ్లు పైబడిన వారికి ప్రభుత్వం పెంక్షన్ 9వేలు చొప్పున ఇవ్వాలి.కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులతో 12గంటల డ్యూటీ పనులు రద్దు చెయ్యాలి 8గంటల పనివిధానం అమలు చెయ్యాలి. 2 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు, పెండింగ్ ఏరియర్స్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక 4లేబర్ లేబర్ కోడ్ లను తీసుకొచ్చింది వాటిని వెంటనే రద్దు చెయ్యాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చెయ్యాలి.అందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రతి నెల రెగ్యులర్ జీతాలు ఇవ్వాలి. ఉపాధి కూలీలకు 200రోజుల పనివిధానం అమలు చెయ్యాలి, రోజు కూలి 600వందలు ఇవ్వాలి. ఈ పాలకులు కార్మిక కర్షకులకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ఎర్రజండ citu యూనియన్ కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో citu యూనియన్ నాయకులు భారతీ రేణుక పెంటమ్మ నర్సింలు అమృతమ్మ నీలము శంకర్ శివ కుమార్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Workers' wages should be

You cannot copy content of this page

Scroll to Top