
Woman Brutally Murdered : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కవాడిగూడలోని రత్నదీప్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో శ్వేత అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe