
Fire at Hotel : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; అమలాపురం సర్కులర్ బజారు గీతస్ హోటల్ లో టీ కాస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయింది. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో అందులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సంబంధిత అధికారులు ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు.
