TRINETHRAM NEWS

అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. – ఎం వి వి ప్రసాద్.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం ) జిల్లా ఇంచార్జ్ : అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం వి వి ప్రసాద్.

అల్లూరి జిల్లా, కొయ్యురు మండలం, అంతడా పంచాయతి, కొత్తపల్లిలో గ్రామంలో సోమవారం 22 లక్షల, సి సి రోడ్ మరియు డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవా కార్యక్రమంలో మాజీ జి సి సి చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం వి వి ప్రసాద్, స్థానిక సర్పంచ్ సుర్ల చంద్రరావు, మరియు ఎంపిటిసి ఇరువాడ సత్యవతి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎం వి వి ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పాడేరు నియోజకవర్గంలో, సంక్షేమ కార్యక్రమలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమంలు చెపెట్టడం జరుగుతుంది. అని ఇటీవంటి రాజకీయ బేషాజాలకు పోకుండా అభివృద్దే లక్ష్యంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అని రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతం అని తెలిపారు.

స్థానిక సర్పంచ్ సుర్ల చంద్రరావు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి, గత నాలుగు సంవత్సరంల నుండి కృషి చేసి దాదాపు గా చాలా కార్యక్రమంలు పనులు పూర్తి చేయడం జరిగింది. అని కాకపోతే మా కొత్తపల్లి గ్రామంలో పంట కాలువ ఉరి మధ్యనుండి ఉండటం వలన చిన్నపాటి వర్షం వచ్చిన కొన్ని ఇల్లులోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నాం అని సర్పంచ్ తో పాటు, స్థానిక ఎం పి టి సి సత్యవతి ప్రసాద్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్య పై ఎం వి వి ప్రసాద్ ఫోన్ లో జలవనరల అధికారి రామకృష్ణతో ఫోన్లో మాట్లాడి త్వరగతిన పంట కాలువ నిర్మించడానికి చర్యలు తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలుతో పాటు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కాకూరు చంద్రరావు, బంగారంపేట రాజు మరియు స్థానిక నాయకులు పాల్గున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App