వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు.
చెట్టు విరిగి గాయపడ్డ వారిని పరామర్శించిన వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ భారీ ఈదురు గాలుల కారణంగా వికారాబాద్ పట్టణం కొత్తగడి సమీపంలో ఓ చెట్టు విరిగి ట్రాక్టర్ పై వెళ్తున్న కొత్తగడికి చెందిన ఇద్దరు వ్యక్తులపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ శాసన సభాపతి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మెడిక్యూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లని కోరారు. రమేష్ కుమార్ తో పాటు 1వ వార్డు కొత్తగడి మాజీ కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, నాయకులు చింటు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


