జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
టయోటా బ్రాండ్ కు చెందిన కార్లను గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలనే ఆలోచన చేయడం అభినందనీయమని వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ ల్లో ఏర్పాటు చేసిన టయోటా కార్స్ గ్రామీణ మహోత్సవం కార్యక్రమాన్ని మంజుల రమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టయోటా సంస్థ నిర్వాహకులకు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా జిఎం చిట్టిబాబు మాట్లాడుతూ..

సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారు ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ చెల్లించి టయోటా వాహనాన్ని సొంతం చేసుకోవచ్చని అన్నారు. 18, 19 తేదీలు రెండు రోజులు అందుబాటు ఉండే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ , వికారాబాద్ పట్టణ ప్రముఖులు బస్వరాజ్ , గోవర్ధన్ రెడ్డి , లవ కుమార్, తస్వర్ అలీ , హఫీజ్ జనార్దన్ రెడ్డి మరియు జబ్బర్ , బషీర్ , టయోటా జీఎమ్ చిట్టిబాబు, మార్కెటింగ్ మేనేజర్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Toyota Cars Festival

You cannot copy content of this page