ఇంత చేసి పోసాని, ఆర్జీవిని వదిలేస్తారా

TRINETHRAM NEWS

ఇంత చేసి పోసాని, ఆర్జీవిని వదిలేస్తారా ?

Trinethram News : ఏపీలో మహిళల్ని,కుటుంబాల్ని కించ పరుస్తూ రెచ్చిపోయిన వారిపై కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇలా అరెస్టు చేయవద్దని వ్యతిరేకించేవారు కూడా లేకపోవడం వారు చేసిన ఘోరాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పుడు అందరికీ మరో డౌట్ వస్తోంది. అదేమిటంటే.. ఇతర సోషల్ మీడియా సైకోలకు పెద్దన్నలుగా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి,రామ్ గోపాల్ వర్మలను వదిలి పెడతారా అని.

ఎన్నికలకు ముందు వర్మతో పాటు పోసాని కృష్ణమురళి చంద్రబాబు, పవన్ లను ఎన్నెన్ని తిట్లు తిట్టారో లెక్కలేదు. పోసాని పవన్ కల్యాణ్ తల్లిని, పిల్లల్ని కూడా తిట్టారు. ఇక లోకేష్, చంద్రబాబను గత పదేళ్లుగా తిడుతూనే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా ఉండేవి. ఆయన మహిళల్ని కించం పరిచేలా మార్ఫింగ్‌లు చేసి పోస్టులు పెట్టారు. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. వరిద్దరిపై కూడా నకేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

సినిమా రంగంలో ఉన్నారని వారు చెబితే.. మాట్లాడితే.. పోస్టులు పెడితే అటెన్షన్ వస్తుందన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు వీరిని వాడుకున్నారు. వారు కూడా చంద్రబాబుపై ద్వేషమో.. డబ్బులు వస్తాయన్న ఆశతోనో కానీ గీత దాటిపోయారు. వారికి సరైన ట్రీట్ మెంట్ ఇచ్చి తీరాలన్న వాదన వినిపిస్తోంది. రేపోమాపో వారిని హైదరాబాద్ నుంచి అరెస్టు చేసి తీసుకుపోయారన్న బ్రేకింగ్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top