ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్యాన్సర్ పేషెంట్‌కు రూ. 20,000 ఆర్ధిక సహాయం
రాజమహేంద్రవరం : అభాగ్యులకు తాము నిత్యం అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న స్థానిక 42వ డివిజన్ రత్నంపేట వాంబే గృహాలకు చెందిన దొండపాటి జ్యోతి అనే మహిళకు ఇంక్షన్ కొనుగోలు నిమిత్తం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున కలిసి రూ. 20,000 ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ట్రస్టు తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నామన్నారు. దొండపాటి జ్యోతికి మెరుగైన ఆరోగ్యం కోసం భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
పేద విద్యార్ధులకు ఫీజు నిమిత్తం, అలాగే అనారోగ్యంతో బాధపడే పేదలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు. కాగా ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందచేస్తున్నామని చెప్పారు.
గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్కచెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ల వెంకటరాజు, కేవీ శ్రీనివాస్, పేరూరి అంజి, బొమ్మనమైన శ్రీను, బాలు, రత్నంపేట చిన్ని తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


