Narasimha Japam : దేశం మేలు కోసం నరసింహ జపం

TRINETHRAM NEWS

రాజమండ్రి మే 8 రాజమండ్రి ఉత్తరాది మఠం మరియు ఆంధ్ర మధ్వ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో మనదేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అంతా మంచే జరగాలన్న భావనతో ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆదేశానుసారం శ్రీ లక్ష్మీ నరసింహ మంత్రాన్ని అఖండ జప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమాఖ్య కార్యదర్శి కందాలం నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమాలు రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయ సింహ ఆచార్ ఆధ్వర్యంలో ఓం లక్ష్మీ నరసింహయ నమః అనే మంత్రాన్ని నిత్యము జపించడం ద్వారా దేశానికి దేశం తరఫున పోరాడుతున్న సైనికులకు భగవంతుడు పరిపూర్ణమైన శక్తినిచ్చి నూతన శుభాన్ని చేకూరుస్తారని స్వామీజీ ఉపదేశించారని నరసింహారావు వివరించారు.
తెలుగు రాష్ట్రాలలోనే శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కి ఈ నెల 10వ తేదీన నరసింహ జయంతి సందర్భంగా రాజమండ్రి ఉత్తరాది మఠం సుధా పండితులు విజయ సింహా ఆచార్ స్వీయ పర్యవేక్షణలో రాజమండ్రి గోదావరి తీరంలో ఉన్న ఉత్తరాది మఠ ప్రాంగణంలోని స్వామివారికి కల్యాణోత్సవాన్ని పదో తారీకు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుందని అందరూ పాల్గొనవలసిందిగా నరసింహారావు కోరారు.
కాకినాడలో జర్నలిస్ట్ కాలనీ లో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో మధ్వ పురోహితులు యాత గిరి మద్వేష్ ఆధ్వర్యంలో నరసింహ నామ జప కార్యక్రమాన్ని బుధవారం నుండి ప్రారంభించారని నరసింహారావు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Narasimha Japam for the

You cannot copy content of this page

Scroll to Top