
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ పీకే రామయ్య కాలనీ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఆరు నెలల క్రితం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు పాఠశాలలో చిన్నపిల్లలకు మధ్యాహ్న భోజన సౌకర్యం కోసం ఎన్టిపిసి సిఎస్ఆర్ వారి ఆధ్వర్యంలో నూతన డైనింగ్ హల్ భవనం నిర్మించడం జరిగిందని మల్లేష్ తెలిపారు. ఈ విషయంపై మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ
ఆ భవనం చుట్టూ దాదాపు నాలుగు ఫీట్ల లోతు పెద్ద గుంతలుగా ఉన్నది వర్షాకాలంలో చిన్నపాటి చెరువును తలపించేలా ఉంట్టుందని మేము నెట్ప్ అధికారులకు తెలపడం జరిగిందని అందులో యాష్ ఫిల్లింగ్ చేసి పైన మట్టి పోస్తామని ఎన్టిపిసి అధికారులు మాకు తెలపడం జరిగింది మేము లెటర్ కూడా ఎన్టీపీసీ అధికారులకు ఇవ్వడం జరిగిందని,ఎన్టీపీసీ క్సర్ అధికారులు ఇప్పటివరకు యాష్ ఫీలింగ్ చేయలేదు ఆరు నెలల కావస్తున్నా డైనింగ్ హల్ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు
ఈ విషయంపై శనివారం రోజున ఎన్టిపిసి సిఎస్ఆర్ అధికారులను అడగగా వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి బిక్షపతి నుండి పర్మిషన్ తీసుకోవాలని తెలుపడంతో నేను దాదాపు ఒక 20 సార్లు భిక్షపతి ఫోన్ చేయ్యడం జరిగిందని ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫోన్ ప్రయత్నం చేస్తే ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి వివరాలు తెలుసుకున్నాడు.మళ్ళీ ఫొన్ చేస్తే తియ్యడం లేదు అది ఫ్రీగా ఉండటం కారణంతో అనుకుంట ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్టిపిసి వారి ఆఫీస్ కి వెళ్లి చూడగా అక్కడ కనీసం ఒక అధికారి కూడా అందుబాటులో లేరు ఆపీస్ బాయ్ లు మాత్రమే ఉన్నారు వారు సరైన సమాధానం చెప్పలేదు.
ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నా ప్రజలకు, అధికారులు అందుబాటులో లేక కనీసం ఫొన్ లేపి సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు పొల్యూషన్ అధికారి బిక్షపతి విచారణ జరిపి దయచేసి వారిపై చర్య తీసుకోవాలి మరియు ప్రైమరీ స్కూల్ కపౌండ్ డైనింగ్ హల్ చుట్టూ యాష్ ఫిల్లింగ్ చేసి పిల్లలు మధ్యాహ్న భోజనం తినే పిల్లలకు భోజనశాల అందుబాటులోకి తేవాలని పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ చేతులు జోడించి వేడుకుంటున్నానని కాంగ్రెస్ పార్టీ రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
