మంథని మైనారిటీ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మంథని, ఫిబ్రవరి 22:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు.
శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ బాలికల మంథని మండలం కూచి రాజు పల్లి గ్రామంలోని మైనారిటీ గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బాలికల గురుకులంలో డార్మెంటరీ, క్లాస్ రూమ్, పారిశుధ్య నిర్వహణ, భోజన హాల్, వంట గది, వంట సామాగ్రి భద్ర పర్చే ప్రదేశాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లలతో మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ , విద్య బోధన వంటి వివరాలను ఆరా తీశారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ, మైనారిటీ బాలికల గురుకులంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. బాలికలకు ప్రభుత్వం నిర్దేశించిన కామన్ మెన్యూ ను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే 10వ తరగతి, పరీక్షల దృష్ట్యా స్టడీ అవర్స్ నిర్వహించాలని అన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ పిల్లలతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ అధికారి బిసి అభివృద్ధి అధికారి రంగారెడ్డి , భాగ్య లక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


