తేదీ : 30/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ యంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, శ్రామికులు తమ శ్రమను దారా బోస్తూ దేశ , రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఉత్పత్తి సేవాగ్రంగాలను బలోపేతం చేసే దిశగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నూతన పారిశ్రామిక విధానం పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని మే డే ఒకటవ తేదీన జరుపుకునే అటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారు.
కార్మికులు సంక్షేమంతో వర్ధిల్లినప్పుడే సమాజ ప్రగతి సాధ్యమని, కూటమి ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది అని తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి కార్మికులకు అండగా నిలబడింది. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు కుటుంబానికో పారిశ్రామికవేత్తగా ఉండాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు.
అలాగే సమాజంలో పేదరికాన్ని మామూలుగా నిర్మూలించాలనే లక్ష్యంగా, పి4 విధానం చేయూతగా మారిందని, పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లని, గత ఐదేళ్ల దుర్మార్గ పాలనలో రాష్ట్రం ప్రగతికి దూరమైందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు పరిశ్రమలు స్థాపనతో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ, తిరిగి కార్మికులు, పేదలు వాళ్ల జీవితాల్లో ఎలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయన్నారు. టిడిపి కార్మిక లోకానికి అందగా ఉంటుందని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


