Rights of Workers : కార్మికుల,ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం

TRINETHRAM NEWS

కార్మికుల హక్కులను కాల రాస్తే సహించం. పని గంటల పెంపు విరమించుకోవాలి ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్….

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,సెప్టెంబర్,24: అసెంబ్లీ సమావేశాల్లో పనిగంటల పెంపదలను ఆమోదించడంపై నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక జిబి టి వద్దనున్న మస్తార్ల కార్యాలయాలు వద్ద నిరసన ఆందోళన జరిగింది. ఈ నిరసనలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల హక్కులు కాల రాస్తే సహించేది లేదని, ఉద్యోగుల కార్మికులపై పనిభారం మోపెందుకే పని గంటల పెంపు అని, పని గంటల పెంపుదల తక్షణమే విరమించుకోవాలని, కార్మికుల,ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉద్యమిస్తూ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. పని గంటల పెంపుదల కార్పొరేట్ వ్యక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు అదాని, అంబానీలకు లాభం చేకూర్చేందుకు, వారికి కొమ్ముకాస్తూ కార్మికుల రక్తమాంసాల శ్రమను దోచి పెట్టేందుకే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పని గంటల్లో పెంపుదల చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగాలను ఒక్కొక్క రంగాలుగా ప్రైవేటీకరణ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నతిద్ధమవుతుందని, ఎనిమిది గంటల పని దినాలు కార్మిక చట్టంలో ఉన్న హక్కులని, 8 గంటల పని దినాలు అమలకు ఎన్నో పోరాట ప్రాణ త్యాగాలు చరిత్ర ఉన్నదన్నారు.

ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, పని గంటల పెంపు దినులను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకుంటే చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.ఉద్యోగులను, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుంటే పని దినాలు పెంచుతుంటే అసెంబ్లీ సమావేశాల్లో వారి ఓట్లతో నెగ్గిన ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు వ్యతిరేకించలేదని, వ్యతిరేకించలేని ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలని ఆయన అన్నారు. పని గంటల పెంపుదలపై పరిశ్రమంలో పనిచేస్తున్న ప్రతి కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పని గంటల పెంపుదలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని, పని గంటలు పెంపుదలను వ్యతిరేకించకపోతే భవిష్యత్తు అందాకారం అవుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని అని ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, లక్ష్మణ్, వీరబాబు, దుర్గా, మహేశ్వరి, కావయమ్మ, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

rights of workers

You cannot copy content of this page

Scroll to Top