Mon. Mar 9th, 2026

Gaddam Ananya : రైతు బజార్ ను అభివృద్ధి చేసి రైతులకు మేలుచేస్తాం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ మరియు అడిషనల్ కలెక్టర్ సుదీర్ తో కలిసి వికారాబాద్ రైతుబజర్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.

ఈ సందర్బంగా అనన్య రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.

పురపాలక సంఘం మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అనుసంధానంతో రైతుబజార్ అభివృద్ధి చేస్తామని తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ సహాయ సహకారాలతో వికారాబాద్ మునిసిపల్ ను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ.సుధాకర్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will develop Rythu Bazar and benefit the farmers

Related Post

You cannot copy content of this page