న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ .
దేవరకొండ అక్టోబర్ 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో స్థానికంగా ఉన్న కార్యాలయంలో న్యాయవాది కృష్ణ జాంభవ్ సుప్రీంకోర్టు సిజెఐ బిఆర్ గావాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది కేవలం న్యాయవ్యవస్థపైనే కాదు దేశంపై జరిగిన దాడిగానే పరిగనించాలి.మతం పేరుతో దేశంపై, న్యాయవ్యవస్థపై దాడి జరుగుతున్నదంటే సాధారణ ప్రజల పట్ల వీళ్ళ అకృత్యాలు ఎట్లా ఉంటాయో అర్ధం చేసుకోవొచ్చు. దేశంలోనే మత ఉగ్రవాదులు ఉన్నారు,వారు అన్ని రంగాలలో ఉన్నారు.
వారు రాజ్యాంగ, దేశ వ్యతిరేఖ కార్యాకలపాలకు పాల్పడుతూ భిన్నత్త్వంలో ఏకత్వం నినాదాన్ని దెబ్బతీసి కల్లోలం చేయాలన్నే వారి లక్ష్యంగా దేశంలో రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు నిరహిస్తున్నా ఉన్న ఆర్ ఎస్ ఎస్ సంస్థను ఉగ్రవాద సంస్థగా పరిగణించి దానిని రద్దు చేయాలి, అల్లరి మూకలను అరెస్ట్ చేయాలి. బేషరతుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి.దేశానికి ఆర్ ఎస్ ఎస్, బి జె పి ఎంత ప్రమాదమో అర్ధం చేసుకోవాలి.రేపు దేశవ్యాప్త నిరసనకు దేశ పౌరులందరు, ప్రజా సంఘాలు, కుల, మత, మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు న్యాయవాదులు, కోర్టు స్టాప్ ప్రతి ఒక్కరు బైకాడ్ చేయాలిన్సిందిగా విజ్ఞప్తిచేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


