Crowded around the Puligundu Hill : జనసంద్రమైన పులిగుండు కొండ చుట్టు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్ద శనివారం కొండ చుట్టూ తిరుణాలు నిర్వహించినారు. సంక్రాంతి తర్వాత నాలుగో రోజు ఇక్కడ కొండ చుట్టు తిరుణాలు నిర్వహించడం ఆనవాయితీ.

ఇక్కడికి కర్ణాటక,తమిళనాడు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇసుక వేస్తే రాలనంత జన సాంద్రత ఉంది. అల్లరి ముకల వల్ల మహిళలు ఇబ్బంది గురి అయ్యారు. టూ వీలర్స్ కి ఫోర్ వీలర్స్ కి పార్కింగ్ సమస్య ఏర్పడింది. నిర్వాహకుల యొక్క నిర్వహణ లోపం కనబడింది.

వాహనాలను నియంత్రించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కలు తీర్చుకున్నారు. పులి గుoడేశ్వర ఆలయ చైర్మన్ షణ్ముఖ రెడ్డి అక్కడ ఉండి నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించారు.

పులిగుండు వద్ద బందోబస్తు చిత్తూరు తాలూకా సిఐ నిత్య బాబు, పెనుమూరు స్టేషన్ మాస్టర్ వెంకట నరసింహ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు డబ్బులు వసూలు చేశారు కానీ ట్రాఫిక్ నియంత్రణ చేయలేకపోయారని భక్తులు వాపోయారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Crowded around the Puligundu hill

You cannot copy content of this page

Scroll to Top