Trinethram News : ఇరాన్పై దాడుల అనంతరం ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఓ వీడియో విడుదల చేశారు. ఆ దేశ న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్స్, సైంటిస్ట్ల్స్ప దాడి చేశామన్నారు. ‘ఇరాన్ 9 ఆటమ్ బాంబ్స్ ఉత్పత్తి చేయగలిగేంత యురేనియం సమకూర్చుకుంది. ప్రొడక్షన్ పూర్తైతే టెర్రరిస్టులకు అణు బాంబులు చేరే ప్రమాదం ఉంది. అది జరగకుండా ఆపుతున్నాం’ అని వ్యాఖ్యా నించారు. ఇరాన్ వెనక్కి తగ్గకపోతే దాడులు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. రాజధాని టెహ్రాన్లో ఉన్న పలు అణు స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. మరోవైపు యుద్ధ విమానాలతో నగరవ్యాప్తంగా పలు చోట్ల బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దాడులకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ హతం?
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బగేరిని హతమార్చినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే దీన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ దేశ మిలిటరీ విభాగం స్పందించింది. ‘ఎప్పుడూ యుద్ధం కోరుకోం. కానీ కావాలని ఎవరైనా ఆహ్వానిస్తే సరైన సమాధానం చెబుతాం’ అని ట్వీట్ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


