జూన్ 26, 2026
TRINETHRAM NEWS

నిందితుడు అరెస్ట్, 8 లక్షల నగదు స్వాధీనం.
కేసును చేదించిన పోలీసులను అభినందించిన దేవరకొండ ఏ ఎస్ పి , పీ .మౌనిక.

దేవరకొండ జూన్ 13 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి సుమారు 17 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించడం మాదిన్నె కృష్ణ అలియాస్ వేణుగోపాల్ రెడ్డి (52 )ని దేవరకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి ఎనిమిది లక్షలు ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ టౌన్ లోని పిఎన్ఆర్ కాలనీకి చెందిన మూడవ స్వాతి మూడవ రమేష్ షేక్ సైదా బేగం షేక్ తబ్రేజ్ మార్చి 1న దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
2022 సంవత్సరంలో ఒక వ్యక్తి తమకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద నుంచి వరుసగా 5లక్షలుమరియు 12 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆ డబ్బులతో పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దేవరకొండ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 68 /2025యు ఎస్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేయబడింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరకొండ ఏ ఎస్పీ పి మౌనిక ఐ పి ఎస్, ఆధ్వర్యంలో పరిశోధనాధికారి ఇన్స్పెక్టర్ ఎమ్ నరసింహులు మరియు వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు బాధితులు కోల్పోయిన కొంత నగదు (8 లక్షలు) నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును చేదించడం లో అద్భుత ప్రతిభ కనబరిచిన దేవరకొండ పోలీస్ సిబ్బంది అయినా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ కాటి సతీష్ రాజారామ్ (రైటర్) బూర అంజి,, పి వెంకన్న, ఎస్.కె చాంద్ పాషా, వి సింహాద్రి, సోమ్లా (డ్రైవర్), లను దేవరకొండ ఏఎస్పి పి మౌనిక ఐ పి ఎస్, అభినందించారు.
వారికి తగిన శాఖపరమైన రివార్డులు ప్రతిపాదించనున్నట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge scam in the

You cannot copy content of this page