త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమండ్రి,జూన్ 5:వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్.కె.వి.టి.డిగ్రీ కళాశాల ఆనందా గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్తిబాబు అధ్వర్యంలో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిధులుగా విచ్చేసిన ద్వారకా తిరుమల దేవస్థానం బోర్డు మాజీ సభ్యుర్యాలు కె.విజయ రాజ్యలక్ష్మి, సామాజిక వేత్త నల్లబంతు రాజ్యలక్ష్మి, రిటైర్డ్ టీచర్ రామదేవు హేమవల్లి,రూపశ్రీ శివలక్ష్మి దేవీప్రియ ఇండస్ట్రీస్ అధినేత ఎస్.దుర్గా ప్రసాద్, సామాజిక వేత్త కంటిపూడి శ్రీనివాస్ చౌదరి లను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించారు.ముఖ్య అతిధులు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.
అనంతరం ముఖ్య అతిధులు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్విరామంగా సేవలు అందించడం గర్వించదగ్గ విషయంగా అభివర్ణించారు.క్లబ్ అభివృద్ధికి తమవంతు ఆర్థిక సహాయ సహకారాలు అందచేశారు. క్లబ్ అభివృద్ధికి కె.విజయ రాజ్యలక్ష్మి రూ.5,000,ఎన్.రాజ్యలక్ష్మి రూ.10,000,ఆర్.హేమవల్లి రూ.10,000 అందించారు.క్లబ్ విద్యానిధికి మల్లికి వీర్రెడ్డి ,రూ.6,000,పడాల కొండారెడ్డి రూ.6,000,ఆదర్ష కిట్టీపార్టీ వారు.రూ.5.000(ఎస్.ఎన్.కె.పెరల్ ప్లాజా,వి.ఎల్.పురం), భేరి రత్నాంబ రూ.10,000, రాళ్ళబండి సత్యవాణి రూ.10,000,ఎ.వి.రమణి రూ.10,000 అందించారు.ముఖ్య అతిధుల చేతుల మీదుగా ఒక్కో వృద్ధునికి రూ.500 చొప్పున మొత్తం 80 మందికి రూ.40,000 అందించారు.వృద్ధులందరికీ అల్పాహారాన్ని పామర్తి గోపాలరావు కుమారుడు పామర్తి ఫణికిరణ్ అందించారు.జూలై 5 వ తేదీన ప్రతిభకలిగిన పేద విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందచేస్తామని కార్యదర్శి గుబ్బల గంగాభవాని తెలిపారు.ఈ కార్యక్రమంలో గీసాల బాపూజీ,అనసూరి శ్రీనివాస్, రామానాయుడు, కాశీ విశ్వనాథం,రొక్కం అప్పారావు,భేరి రత్నాంబ,లంకే శ్రీదేవి,మోగల్తూరు దుర్గ, సూరపురెడ్డి తాతారావు, తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అంతా క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


